Home » Telugu Recipes » Homemade బనానా బర్ఫీ cooking recipe
GumaGumalu Recipes
Recipes Food Court Specials Andhra Recipes How To Cook Cooking School Blog  

About Telugu Recipes

బనానా బర్ఫీ


ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం బనానా బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే బనానా బర్ఫీ మీ సొంతం.

బనానా బర్ఫీ కి కావలసిన పదార్ధాలు:

అరటిపండు - ఒకటి
పుట్నాలపొడి - 3 స్పూన్స్
కార్న్ ఫ్లోర్ - 2 స్పూన్స్
నెయ్యి - 1/4 కప్పు
పంచదార - 1/4 కప్పు
యాలకులపొడి - 1/4 స్పూన్

బనానా బర్ఫీ తయారు చేసే విధానం:

ముందుగ అరటిపండుని గుజ్జులా చేసుకోవాలి. బాణలిలో నెయ్యి వేసి కాగాక అరటిపండుగుజ్జు వేసి బాగా వేయంచాలి. తరువాత అందులో పంచదారను కూడా వేసి అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. దగ్గర పడ్డాక పుట్నాల పొడి, కార్న్ ఫ్లోర్, యాలకులపొడి కూడా వేసి కలపాలి.
గట్టి పడిన తరువాత ముందుగ నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని మనకు కావలసిన ఆకారంలో కట్ చేసుకొని పైన జీడిపప్పును అలంకరించుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే బనానా బర్ఫీ తయార్. అరటిపండుని తినని వాళ్ళు కూడా దీనిని ఇష్టంగా తింటారు.

Search Recipes (over 5000 recipes)
 
Home Remedies

Recipes - Specials - Food Court - Ingredient Glossary - Recipe Aricles - Health Remedies - Home
All Rights Reserved. Copyright 2010 GumaGumalu.com