ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం బఠాణీ భాజీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే బఠాణీ భాజీ మీ సొంతం.
బఠాణీ భాజీ కి కావలసిన పదార్ధాలు:
బఠాణీలు - 2 కప్పులు
టొమాటో ముక్కలు - 2 కప్పులు
క్యాప్సికం - 2
ఉల్లిపాయలు - 2
కొబ్బరి పొడి - 2 స్పూన్స్
వెల్లులి - 4
కొత్తిమీర -ఒక కట్ట
దనియాల పొడి - 1/2 స్పూన్
జీలకర్ర పొడి -1/2 స్పూన్
పసుపు - చిటికెడు
ఉప్పు - సరిపడ
బఠాణీ భాజీ తయారు చేసే విధానం:
బఠాణీలను ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. మరుసటిరోజు నానిన బఠాణీలను కుక్కర్ లో వేసి ఒక్క విజిల్ రానివ్వాలి. తరువాత కొత్తిమీరను, ఉల్లిపాయలను విడివిడిగ శుభ్రంగా కడిగి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి వెల్లులి రేకలు, ఉల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత పసుపు, కారం, దనియాలపొడి, జీలకర్ర పొడి, సిమ్లామిర్చి వేసి మరో అయిదు నిమిషాలు వేయించిన తర్వాత బఠాణీలను వేసి కలబెట్టాలి.
తర్వాత కొత్తిమీర ముద్ద, ఉప్పు, కొబ్బరిపొడి వేసి రెండు కప్పుల నీళ్ళు పోసి బాగా ఉడకనివ్వాలి. చివరగా టొమాటో ముక్కలు వేసి మరో ఐదు నిమిషాలు సన్నటి సెగమీద మగ్గనించి దించేసుకోవాలి.అంతే ఎంతో రుచిగా ఉండే బఠాణీ భాజీ తయార్, ఇది రోటీలోకీ అన్నంలోకీ చాలా బాగుంటుంది.