బటర్ టాఫీ
ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం బటర్ టాఫీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే బటర్ టాఫీ మీ సొంతం.
బటర్ టాఫీ కి కావలసిన పదార్ధాలు:
వెన్న - 1 కప్పు
చాక్లెట్ పౌడర్ - 1 కప్పు
జీడి పప్పు ముక్కలు - 1 కప్పు
పంచదార - 2 కప్పులు
నెయ్యి - 3 స్పూన్స్
నీళ్ళు -1/2 కప్పు
ఉప్పు -చిటికెడు
బటర్ టాఫీ తయారు చేసే విధానం:
ముందుగా ఒక పాత్ర లోకి వెన్న, పంచదార, నీళ్ళు, ఉప్పు వేసి బాగా కలిపి స్టవ్ మీద పెట్టి సన్నని మంట పై ఉంచి ఆపకుండా కలుపుతూ పాకం తయారు చేసుకోవాలి. అది మరుగుతూ ఉన్నప్పుడు అందులోనే సగం కప్పు జీడిపప్పు ముక్కలు వేసి అడుగు మాడకుండా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఒక పళ్ళానికి నెయ్యి రాసి పక్కన ఉంచుకోవాలి. తరువాత పాకం చిక్కపడిన తరువాత దించి ఆ పళ్ళెంలో పోసి సమానంగా చేసుకోవాలి.
తరువాత ఒక గిన్నెలో చాక్లెట్ పౌడర్ వేసి సన్నని సెగపై పౌడర్ ని కరిగించి ఇందాక ప్లేట్ ఉంచిన మిశ్రమముపై సమానంగా పోయాలి. ఇప్పుడు మిగత జీడిపప్పు ముక్కల్ని పైన చల్లుకోవాలి. బాగా చల్లారిన తరువాత కావలసిన ఆకారంలో కట్ చేసి అర గంట సేపు డిఫ్రిజ్ లో పెట్టి తీసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. అంతే చల్లచల్లని బటర్ చాక్లెట్ తయార్. మీరుకూడా ట్రె చేయండి...

