Home » Telugu Recipes » Homemade బజ్జీలు cooking recipe
GumaGumalu Recipes
Recipes Food Court Specials Andhra Recipes How To Cook Cooking School Blog  

About Telugu Recipes

బజ్జీలు


ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం బజ్జీలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే బజ్జీలు మీ సొంతం.

బజ్జీలు కి కావలసిన పదార్ధాలు:

బజ్జీ మిర్చీ - 10
శనగపిండి - 100 గ్రా
బియ్యం పిండి- 2 స్పూన్స్
ఉల్లిపాయ - 1
చింతపండు గుజ్జు - 2 స్పూన్స్
జీలకర్ర పొడి - 1 స్పూన్
వాము - 1 స్పూన్
కారం - 1/2 స్పూన్
సోడా ఉప్పు - చిటికెడు
పుట్నాల పొడి - 4 స్పూన్స్
ఉప్పు - సరిపడ
కొత్తిమీర -చిన్న కట్ట
నూనె - వేయించడానికి సరిపడ

బజ్జీలు తయారు చేసే విధానం:

ముందుగా బజ్జీ మిర్చి మిరపకాయలను కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. వాటిని మధ్యలోకి చీరి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పుట్నాల పొడి ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, చింతపండు గుజ్జు, జీలకర్ర పొడి, వాము వేసి కొద్దిగా నీళ్ళు కలిపి గట్టిగ చేసి ఈ మిశ్రమాన్ని మధ్యకి చీరుకున్న బజ్జీ మిర్చి కాయల్లో కూరాలి.
తర్వాత శనగపిండిలో ఉప్పు, కారం, సోడా ఉప్పు, బియ్యం పిండి వేసి నీళ్ళు పోసి మరి గట్టిగా కాకుండా జారుగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి నూనె పోసి కాగిన స్టఫ్ చేసిన మిరపకాయలను శనగ పిండిలో ముంచి నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి.

Search Recipes (over 5000 recipes)
 
Home Remedies

Recipes - Specials - Food Court - Ingredient Glossary - Recipe Aricles - Health Remedies - Home
All Rights Reserved. Copyright 2010 GumaGumalu.com