ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం పెసరపప్పు పాయసం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే పెసరపప్పు పాయసం మీ సొంతం.
పెసరపప్పు పాయసం కి కావలసిన పదార్ధాలు:
పెసరపప్పు- 100 గ్రా
పంచదార - 150 గ్రా
పచ్చికొబ్బరి తురుము -1/2 కప్పు
యాలకులపొడి- 1 స్పూన్
జీడిపప్పు- సరిపడ
బాదాం పప్పు -సరిపడ
కిసిమిస్- సరిపడ
పాలు- 2 కప్పులు
నెయ్యి - 4 స్పూన్
నీళ్ళు -1 కప్పు
పెసరపప్పు పాయసం తయారు చేసే విధానం:
ముందుగ పెసరపప్పును బాణలిలో నెయ్యి వేడి చేసి అందులో పెసరపప్పును వేసి చిన్న మంటపై దోరగా వేయించాలి. తరువాత కుక్కర్లో ఒక కప్పు పాలు, నీళ్ళు, వేయించిన పెసరపప్పు, కొబ్బరి తురుము అన్ని కలిపి మెత్తగా అయ్యే వరకు
ఉడికించాలి.
ఇప్పుడు మరొక పాత్రలో మిగిలిన పాలు, పంచదార, వేయించిన ఎండుద్రాక్ష చేర్చి బాగా మరుగుతున్నప్పుడు పెసరపప్పు మిశ్రమాన్ని అందులో వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత బాణలిలో నెయ్యి వేసి జీడిపప్పు, కిసిమిస్, బాదాం పప్పు, వేసి దోరగా వేయించి ఈ మిశ్రమంలో వేసి చివరగా యాలకులపొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే రుచిగా వేడి వేడి పెసరపప్పు పాయసం తయార్.