ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం పెరుగు వడ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే పెరుగు వడ మీ సొంతం.
పెరుగు వడ కి కావలసిన పదార్ధాలు:
మినపప్పు - 1/4 కేజీ
పెరుగు - 4 కప్పులు
ఉల్లిపాయ ముక్కలు - 2కప్పులు
పచ్చిమిర్చి - 3
అల్లంతురుము - 2 స్పూన్స్
ఉప్పు - సరిపడ
నూనె - సరిపడ
పోపుగింజలు - 2 స్పూన్స్
సోడా ఉప్పు - చిటికెడు
చాట్ మసాల- 1/2 స్పూన్
కొత్తిమీర తురుము - సరిపడ
పెరుగు వడ తయారు చేసే విధానం:
మినపప్పుని 5 గంటలపాటు నానపెట్టుకోవాలి. తరువాత మెత్తగా రుబ్బుకొని అందులో ఉప్పు, సోడా ఉప్పు కలిపి చిన్నచిన్న గారెలుగా చేసి బాణలిలో నూనె పోసి కాగాక గారెలు వేసి మరి ఎర్రగా కాకుండా కొంచం ఎర్రగా రాగానే తీసుకోని పక్కన ఉంచుకోవాలి.
ఇప్పుడు మరో బాణలిలో కొంచం నూనె పోసి కాగాక పోపు గింజలు వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిముక్కలు, అల్లంతురుము వేసి బాగా వేగనివ్వాలి. పెరుగుని మరీ పలుచగా కాకుండా కొద్దిగా నీళ్ళు పోసి కొద్దిగా ఉప్పు వేసి వేయంచిన ఉల్లిపాయలు వేసి అందులోనే ఇందాక తయారు చేసుకున్న వడలు వేసి 45 నిముషాలు నాననివ్వాలి. ఇప్పుడు పైన చాట్ మసాల, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవాలి.