ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం పూరీ లడ్డులు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే పూరీ లడ్డులు మీ సొంతం.
పూరీ లడ్డులు కి కావలసిన పదార్ధాలు:
గట్టిగ కాల్చిన పూరీలు- 10
పంచదార - 1 కప్పు
యాలకులపొడి -1/4 స్పూన్
పాలు -కొద్దిగ
నెయ్యి - సరిపడ
పూరీ లడ్డులు తయారు చేసే విధానం:
ముందుగ ఈ పూరీ లను ముక్కలు చేసి మిక్సి లో పొడి చేసుకోవాలి. తరువాత పంచదార కూడ మిక్సి
చేసుకోవాలి. ఇప్పుడు పూరీ పొడి, పంచదార పొడి, యాలకులపొడిని బాగా కలుపుకొని.
స్టవ్ మీద బాణలి పెట్టి నెయ్యి వేసి ఈ పొడిని వేసి రెండు నిముషాలు బాగా కలిపి దింపుకోవాలి. చల్లరినాక
అందులో కొద్దిగ పాలు వేసి కొద్ది కొద్దిగ తీసుకోని చిన్నచిన్న లడ్డులగా చుట్టుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే
పూరీ లడ్డులు తయార్.