ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం పూరీ పొట్లాలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే పూరీ పొట్లాలు మీ సొంతం.
పూరీ పొట్లాలు కి కావలసిన పదార్ధాలు:
గోధుమపిండి- 1/2 కేజీ
మైదా - 200 గ్రా
రిఫైండ్ ఆయిల్ - తగినంత
నెయ్యి -100 గ్రా
ఉప్పు -1/2 స్పూను
పంచదార - 1 కేజీ
మంచినీళ్లు- తగినన్ని
లవంగాలు- సరిపడ
యాలకుల పొడి- 1/2 స్పూను
బేకింగ్ పౌడర్ - 1/2 స్పూను
పూరీ పొట్లాలు తయారు చేసే విధానం:
గోధుమపిండి, మైదా, బేకింగ్ పౌడర్ కలపాలి. ఉప్పు, కరిగించిన నెయ్యి పోసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ముద్దలా చేసి ఓ గంట సేపు నాననివ్వాలి. తరువాత పిండిని చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి. పలుచని పూరీలా చేసి దాన్ని సగానికి కత్తిరించాలి. ఎప్పుడు ఒక్కో భాగాన్ని మిటాయి పొట్లంలా మడిచి విడిపోకుండా లవంగాన్ని గుచ్చాలి.
అన్నీ ఇలానే చేసి పెట్టుకోవాలి.
తరువాత మందపాటి పాత్ర లో పంచదార వీసి అందులో తగినన్ని నీళ్లు పోసి లేతపాకం పట్టి యాలకుల పొడి కలిపి ఉంచాలి.కడాయిలో నూనె పోసి బాగా కాగాక ఈ పూరీ పొట్లాలు కొద్ది కొద్దిగా వేస్తూ దోరరంగులో వేయించి తీసి వేడివేడి పంచదార పాకం లో వేసి. పది నిముషాలు పాకం లో ఉంచి తీసి వరుసగా పూరీ పొట్లాలను అమర్చి మిగిలిన పాకాన్ని వాటి పైన పోయాలి. ఇలా చేసినవి వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి.