ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం పుదీనా రైస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే పుదీనా రైస్ మీ సొంతం.
పుదీనా రైస్ కి కావలసిన పదార్ధాలు:
బియ్యం - 1 కేజీ
ఉల్లిపాయలు - 2
నెయ్యి - 50 గ్రా
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
పచ్చి మిర్చి - 5
కొత్తిమీర -1 కట్ట
పుదీనా - 2 కట్టలు
పెరుగు - 1 కప్పు
బిర్యానీ ఆకులు -కొన్ని
గరం మసాల -కొన్ని
ఉప్పు - సరిపడ
పుదీనా రైస్ తయారు చేసే విధానం:
ముందుగా కొద్దిగా పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి కలిపి మిక్సి చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత వెడల్పాటి గిన్నెలో నెయ్యి వేడి చేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకులు, లవంగాలు, యాలకులు, వేసి వేయించాలి. వేగాక అందులో పుదీనా పేస్ట్ పెరుగు వేసి పది నిముషాలు బాగా కలుపుకోవాలి.
తరువాత అందులో రెండు లీటర్ల నీళ్ళు పోసి సరిపడ ఉప్పు వేసి మరుగుతుండగా ముందుగా నానబెట్టుకుని ఉన్న బియ్యాన్ని అందులో పోయాలి. బియ్యం కొద్దిగా ఉడికిన తరువాత బాగా ఉడికిన తరువాత పైన కొత్తిమీర, పుదీనా వేసి మరో ఐదు నిముషాలు సిమ్ లో ఉంచి దించేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే పుదీనా రైస్ సిద్ధం.