ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం పుణుకులు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే పుణుకులు మీ సొంతం.
పుణుకులు కి కావలసిన పదార్ధాలు:
ఉప్మారవ్వ - 1/4 కేజీ
మైదాపిండి - 150 గ్రా
మినపపిండి - 1 కప్పు
ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు
పచ్చిమిర్చి - 6
కొత్తిమీర - సరిపడ
వంటసోడా - చిటికెడు
ఉప్పు - సరిపడ
నూనె - సరిపడ
పుణుకులు తయారు చేసే విధానం:
ముందుగ ఓ గిన్నెలో మినప్పిండి వేసి అందులోనే రవ్వ, మైదాపిండి, వంటసోడా వేసి నీళ్లు చేర్చి జారుగా కలిపి 3 గంటలపాటు పులియనివ్వాలి. తరువాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము, వంటసోడా, ఉప్పు వేసి బాగా కలపాలి.
తరువాత బాణలిలో నూనె వేసి కాగిన తరువాత పిండిని చిన్నచిన్న ఉండలుగాచేసి కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించి తీయాలి. అంతే వేడి వేడి కరాచి పుణుకులు రేడి, వీటిని ఏ చట్నీతో తిన్నా రుచిగా ఉంటాయి.