Home » Telugu Recipes Homemade పుచ్చ పండు సలాడ్ cooking recipe
GumaGumalu Recipes
Recipes Food Court Specials Andhra Recipes How To Cook Cooking School Blog  

About Telugu Recipes

పుచ్చ పండు సలాడ్

కావలసిన పదార్ధాలు:

3/4 కప్పు ఉల్లిపాయ తరిగినది, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 1/2 క్వార్ట్స్ గింజలు తీసి ముక్కలుగా కోసిన పుచ్చపండు, 3/4 విడదీసిన జున్ను, అర కప్పు కోసిన ఆలివ్ లు, ఒక కప్పు పుదినా ఆకులు.

తయారు చేసే విధానం:

ఒక గిన్నెలో తరిగిన ఉల్లిపాయ, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఒక పది నిమిషాల పాటు అలాగే ఉంచాలి అలా చేస్తే ఉల్లిపాయలోని ఘాటు వాసన పోయి రుచి వస్తుంది. ఇపుడు ఒక పెద్ద గిన్నెలో పుచ్చపండు ముక్కలు, జున్ను, ఆలివ్ లు, ఉల్లిపాయ, పుదినా ఆకులు వేయాలి. ఇప్పుడు అందులో ఆలివ్ నూనె వేసి బాగా కలపాలి. అంతే ఇక నోరూరించే పుచ్చపండు సలాడ్ రెడీ.

Search Recipes (over 5000 recipes)
 


Recipes - Specials - Food Court - Ingredient Glossary - Recipe Aricles - Health Remedies - Home
All Rights Reserved. Copyright 2010 GumaGumalu.com