ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం పాలక్ పకోడీలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే పాలక్ పకోడీలు మీ సొంతం.
పాలక్ పకోడీలు కి కావలసిన పదార్ధాలు:
పాలకూర - 2 కట్టలు
సెనగపిండి - 1/4 కేజీ
బియ్యంపిండి - 2 స్పూన్స్
నూనె - సరిపడ
అల్లం - చిన్నముక్క
ఉప్పు - తగినంత
పచ్చిమిర్చి - 4
జీలకర్ర - 1/2 స్పూన్
కరివేపాకు - కొంచం
పాలక్ పకోడీలు తయారు చేసే విధానం:
ముందుగా పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర పొడి, ఉప్పు వేసి మిక్సీలో పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత శుభ్రం చేసుకున్న పాలకూరను, కరివేపాకును ఓ గిన్నెలోకి సన్నగా కట్ చేసి ఉంచుకోవాలి. సెనగపిండి, బియ్యంపిండిలో కొద్దిగా నూనె వేడి చేసి పోయాలి.
తర్వాత పాలకూరను, అల్లం పేస్ట్ ను కలిపి తగినన్ని నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. స్టవ్‌మీద బాణలి పెట్టి నూనె పోసి కాగిన తరువాత పిండిని చిన్న చిన్న ముద్దలుగా వేసి దోరగా వేయించి తీసేయాలి. అంతే రుచికరమైన పాలక్ పకోడీలు తయార్.