ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం పాలకూర వేపుడు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే పాలకూర వేపుడు మీ సొంతం.
పాలకూర వేపుడు కి కావలసిన పదార్ధాలు:
పాలకూర - 4 కట్టలు
ఉల్లిపాయ - 1
పెసర పప్పు - 2 స్పూన్స్
పసుపు - చిటికెడు
పుట్నాలపప్పు పొడి - 2 స్పూన్స్
ఎండుమిర్చి - 5
పోపు గింజలు - 2 స్పూన్స్
పచ్చిమిర్చి- 2
వెల్లుల్లి- 6
నూనె - 3 స్పూన్స్
ఉప్పు -సరిపడ
పాలకూర వేపుడు తయారు చేసే విధానం:
ముందుగ పాలకూరను బాగా కడిగి నీళ్ళు వంపేసి కట్ చేసుకోవాలి బాణలిలోనూనె పోసి కాగాక పోపు గింజలు, పెసరపప్పు వేసుకొని కొద్దిగా వేగిన తరువాత దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చిలను వేసి మరో అర నిమిషంపాటు
వేయించాలి.
తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి కాసేపు వేగాక, పసుపు, ఉప్పు వేసి కలిపి కట్ చేసిన పాలకూరను అందులో వేసి బాగా కలిపి పదినిమిషాలపాటు సన్నటి మంటమీద ఉడికించాలి. నీళ్ళు లేకుండా బాగా పొడిగా అయిన తరువాత పైన పుట్నాల పొడి చల్లి, కలిపి దించేస్తే సరి అంతే పచ్చగా నోరూరించే పాలక్ ఫ్రై రేడి.