ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం పన్నీర్ శాండ్ విచ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే పన్నీర్ శాండ్ విచ్ మీ సొంతం.
పన్నీర్ శాండ్ విచ్ కి కావలసిన పదార్ధాలు:
శాండ్ విచ్ బ్రెడ్ ముక్కలు - 8
పన్నీర్ - 100 గ్రా
శనగపిండి -100 గ్రా
ఉల్లిపాయ -1
కారం -1 స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్టు - 1 స్పూన్
ఉప్పు -సరిపడ
నూనె- సరిపడ
పన్నీర్ శాండ్ విచ్ తయారు చేసే విధానం:
ముందుగ ఉల్లిపాయ సన్నగా తరగాలి. పన్నీర్ ని తురుముకోవాలి. తరువాత బాణలిలో ఒక స్పూన్ నూనె వేసి కాగాక ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేగాక పన్నీర్, ఉప్పు, కారం, గరంమసాల వేసి 5 నిముషాలు వేయించి దించి పక్కన ఉంచాలి. ఇప్పుడు బ్రెడ్ ముక్కల అంచులు తీసేసి వేటిని త్రికోణాకారంలో కట్ చేసుకోవాలి.
తరువాత ఒక గిన్నెలో ఉప్పు, శనగపిండి తగినన్ని నీళ్ళు పోసి గట్టిగ కలుపుకోవాలి. అందులోనే వేయించిన పన్నీర్ మిశ్రమాన్నివేసి కలిపి కట్ చేసిన బ్రెడ్ ముక్కను తీసుకోని దాని మీద ఈ మిశ్రమాన్ని పలుచగా రాసి పైన మరో బ్రెడ్ ముక్క పెట్టి శాండ్ విచ్ లా తయారు చేసుకోవాలి. ఇలా మొత్తం బ్రెడ్ ముక్కల్ని చేసుకుని పక్కన పెట్టాలి. తరువాత బాణలిలో నూనె పోసి కాగాక బ్రెడ్ ముక్కలను వేసి ఎర్రగా వేయించి తీయాలి. వీటిని టొమాటో సాస్ తో తీసుకోవచ్చు.