ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం పన్నీర్ మసాల ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే పన్నీర్ మసాల మీ సొంతం.
పన్నీర్ మసాల కి కావలసిన పదార్ధాలు:
పన్నీరు ముక్కలు -200 గ్రా
పల్లీలు - 100 గ్రా
నువ్వులు -50 గ్రా
ఉల్లిపాయలు -2
టమోటలు -2
పచ్చిమిర్చి-2
గరంమసాల పొడి -1/2 స్పూన్
పసుపు -1/2 స్పూన్
కారం - సరిపడ
ఉప్పు - సరిపడ
నూనె - సరిపడ
పోపుగింజలు -1 స్పూన్
పన్నీర్ మసాల తయారు చేసే విధానం:
ముందుగ పల్లీలు నూనె లేకుండా వేయించుకోవాలి. తరువాత నువ్వులు కూడా వేయంచి. పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయల్ని మిక్సి చేసుకోవాలి. టమాటాలు కూడా మిక్సి చేసుకోవాలి. పల్లీలు, నువ్వులు, పచ్చి మిర్చి కలిపి మిక్సి చేసి పక్కన ఉంచుకోవాలి. తరువాత బాణలిలో నూనె పోసి కాగాక పన్నీరు ముక్కలు వేసి ఎర్రగా వేగనివ్వాలి. వేగాక వాటిని తీసి చల్లటి నీటిలో వేసి రెండు నిమిషములు ఉంచి నీరు లేకుండా పిండి బయటకితియ్యాలి.
ఇప్పుడు మరో బాణలిలో 3 స్పూన్స్ నూనె పోసి కాగాక పోపుగింజలు వేసి వేగాక ఉల్లిపాయ పేస్టు వేసి బాగా వేయించుకోవాలి. ఎర్రగా అయిన తరువాత టమాటో పేస్టు కూడా వేయించుకోవాలి. ఈ రెండు వేగినాక పల్లిల పేస్టు వేసి రెండు నిముషాలు మూత పెట్టాలి. ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు, గరంమసాల పొడి, సరిపడ నీళ్ళుపోసి మరుగుతూ ఉన్నప్పుడు
పన్నీరు ముక్కలు వేసి మూత పెట్టి మరో అయిదు నిముషాలు ఉడికించి పక్కకు తీసుకోని. పైన నిమ్మరసం, కొత్తిమీర వేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే పన్నీర్ మసాల తయార్ దీనిని అన్నంతో కానీ చపాతీ తో కానీ తీసుకోవచ్చు.