Home » Telugu Recipes » Homemade పన్నీర్ జిలేబీ cooking recipe
GumaGumalu Recipes
Recipes Food Court Specials Andhra Recipes How To Cook Cooking School Blog  

About Telugu Recipes

పన్నీర్ జిలేబీ


ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం పన్నీర్ జిలేబీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే పన్నీర్ జిలేబీ మీ సొంతం.

పన్నీర్ జిలేబీ కి కావలసిన పదార్ధాలు:

పన్నీర్- 1/2 కేజీ
కోవా -1/2 కేజీ
మైదా - 6 స్పూన్స్
నూనె - సరిపడ
యాలకులు- 5

పన్నీర్ జిలేబీ తయారు చేసే విధానం:

పన్నీర్, కోవాలని బాగా నలిపి మెత్తని పిండి ముద్దలా చేయాలి. అందులో మైదా వేసి బాగా కలపాలి.ఇప్పుడు పిండి ముద్దను కొంచెం కొంచెంగా తీసుకుని అరచేతులతో సన్నగా పాముల్లాగా పొడవుగా చేసుకొని పాలిథిన్ కవర్ మీద జిలేబీలా చుట్టుకుని పెట్టుకోవాలి.
పాకం తయారీ పంచదారలో మంచినీళ్ళు కలిపి తీగ పాకం వచ్చేవరకూ మరగించాలి. తరువాత స్టవ్ మీద బాణలి పెట్టి నూనె పోసి కాగాక కొన్ని కొన్ని చొప్పున జిలేబీలు వేసి బంగారు వర్ణంలోకి వచ్చే దాకా వేయించి, తీసి పాకంలో వేసి పది నిముషాలు ఉంచి తీయాలి.

Search Recipes (over 5000 recipes)
 
Home Remedies

Recipes - Specials - Food Court - Ingredient Glossary - Recipe Aricles - Health Remedies - Home
All Rights Reserved. Copyright 2010 GumaGumalu.com