Home » Telugu Recipes » Homemade పచ్చిమిరపకాయ పచ్చడి cooking recipe
GumaGumalu Recipes
Recipes Food Court Specials Andhra Recipes How To Cook Cooking School Blog  

About Telugu Recipes

పచ్చిమిరపకాయ పచ్చడి


ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం పచ్చిమిరపకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే పచ్చిమిరపకాయ పచ్చడి మీ సొంతం.

పచ్చిమిరపకాయ పచ్చడి కి కావలసిన పదార్ధాలు:

పచ్చిమిరపకాయలు -10
చింతపండు -100 గ్రా
పల్లీలు - 50 గ్రా
టమాటాలు -2
ఉప్పు - సరిపడ
నూనె - 2 స్పూన్స్

పచ్చిమిరపకాయ పచ్చడి తయారు చేసే విధానం:

ముందుగ చింతపండుని గింజలు లేకుండా చూసి నానపెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేసి వేడి అయిన తరువాత పల్లీలు వేసి వేగించాలి. వేగాక పక్కకు తీసుకోని ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి ఇవి కూడా పక్కకు తీసుకోవాలి.
తరువాత టమాటా ముక్కలుగా కట్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి.ఇప్పుడు వేయించిన పల్లీలు, పచ్చిమిరపకాయలు, చింతపండు, సరిపడ ఉప్పు వేసి మిక్సి చేసుకోవాలి. చివరగా ఉడికించిన టమాటా ముక్కలు వేసి మరో సారి మిక్సి చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే పచ్చిమిరపకాయల పచ్చడి తయరు. దీనిని అన్నముతో కానీ దోసలతో కానీ తీసుకోవచ్చు.

Search Recipes (over 5000 recipes)
 
Home Remedies

Recipes - Specials - Food Court - Ingredient Glossary - Recipe Aricles - Health Remedies - Home
All Rights Reserved. Copyright 2010 GumaGumalu.com