ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం పంచరత్నపప్పు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే పంచరత్నపప్పు మీ సొంతం.
పంచరత్నపప్పు కి కావలసిన పదార్ధాలు:
కందిపప్పు -1/2 కప్పు
పెసరపప్పు -1/2 కప్పు
సెనగపప్పు -1/2 కప్పు
ఎర్ర కందిపప్పు -1 /2 కప్పు
పొట్టు తీయని పెసరపప్పు -1/2 కప్పు
ఉల్లిపాయలు -2
కారం - సరిపడ
జీలకర్ర -1 స్పూన్
జీలకర్ర పొడి -1 స్పూన్
నెయ్యి -4 స్పూన్స్
కొత్తిమీర - కొంచం
టొమాటో గుజ్జు- 1/2 కప్పు
గరం మసాల - చిటికెడు
ఎండుమిర్చి -3
ఉప్పు- సరిపడ
పసుపు - సరిపడ
పంచరత్నపప్పు తయారు చేసే విధానం:
ముందుగ పప్పులన్నీ కలిపి కడగాలి. అందులో పసుపు, ఉప్పు, వేసి సరిపడ నీళ్ళు పోసి మరి మెత్తగా కాకుండా కొంచం పలుకుగా ఉడికించుకోవాలి. తరువాత ఈ పప్పులో టొమాటో గుజ్జు, జీలకర్ర పొడి, గరం మసాల, కారం వేసి అన్ని కలిపి మరికాసేపు ఉడికించాలి. ఇప్పుడు ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి.
తరువాత బాణలిలో నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు కూడ వేసి బాగా వేయించాలి. అందులో ఈ పప్పు కలిపి రెండు నిముషాలు చిన్న మంట మీద ఉంచి పైన కొత్తిమీర చల్లుకొని దింపుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే పంచరత్నపప్పు తయార్ దీనిని అన్నముతో కాని, చపాతితో కానీ తీసుకోవచ్చు.