ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం నువ్వుండ పూర్ణాలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే నువ్వుండ పూర్ణాలు మీ సొంతం.
నువ్వుండ పూర్ణాలు కి కావలసిన పదార్ధాలు:
నువ్వులు - 1/2 కేజీ
కొబ్బరి తురుము - 1 కప్పు
బెల్లం - 1/4 కేజీ
నూనె - సరిపడ
యాలకుల పొడి - 1/2 స్పూన్
మైదా - 400 గ్రా
కార్న్ ఫ్లోర్ - 50 గ్రా
బియ్యంప్పిండి 50 గ్రా
ఉప్పు - చిటికెడు
నువ్వుండ పూర్ణాలు తయారు చేసే విధానం:
ముందుగా నువ్వులను బాగా శుభ్రం చేసి దోరగా వేయించి మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. జార్ లో కొద్దిగా నువ్వు పిండి ఉంచి దానిలో బెల్లం చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దానిని కూడా మిక్సీ వేసి మరొక్క సారి మెత్తగా వేసుకోవాలి. దీనిలో కొబ్బరి కోరును, యాలకుల పొడిని కలపాలి. తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
పూతపిండి కోసం మైదా, కార్న్ ఫ్లోర్, బియ్యంపిండి, చిటికెడు ఉప్పు, కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసి చిక్కగా గుజ్జులా కలిపి పూతపిండిలా చేయాలి. ఈ పిండిని పది నిమిషాలు నాననివ్వాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాణలీ పెట్టి తగినంత నూనె పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత చిన్న చిన్న నువ్వుండలను పూతపిండిలో ముంచి అందులో వేయించి తీయాలి. అంతే తియ్య తియ్యని నువ్వుండ పూర్ణాలు తయార్.