ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం దోసకాయ పెరుగు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే దోసకాయ పెరుగు పచ్చడి మీ సొంతం.
దోసకాయ పెరుగు పచ్చడి కి కావలసిన పదార్ధాలు:
2 కప్పుల పెరుగు, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 3 పచ్చి మిర్చి, 3 వెల్లుల్లి ముక్కలు, పసుపు, చిన్న చిన్న ముక్కలుగా కోసిన దోసకాయ ఒకటి. తాలింపుకి -ఒక్క టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకులు, 2 టీ స్పూన్ ల నూనె.
దోసకాయ పెరుగు పచ్చడి తయారు చేసే విధానం:
దోసకాయ ముక్కలు, పెరుగు, ఆవాలు, పచ్చి మిర్చి, వెల్లులి, ఉప్పు వేసి బాగా కలపాలి. తరువాత తాలింపు పదార్ధాలు వేసి తాలింపు వేయాలి, తరువాత మొత్తం కలిపేసి, ఆ మిశ్రమం పై నుంచి పెరుగు వేసి కలపాలి. అంతే దోసకాయ పెరుగు పచ్చడి రెడీ.