ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం దోసకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే దోసకాయ పప్పు మీ సొంతం.
దోసకాయ పప్పు కి కావలసిన పదార్ధాలు:
ఒక కప్పు కంది పప్పు, 1 1/4 దోసకాయ, తరిగిన ఉల్లిపాయ, చిటికెడు పసుపు. 2-3 పచ్చి మిరపకాయలు, అర టీ స్పూన్ తరిగిన అల్లం, 2 కప్పుల నీళ్ళు, ఉప్పు తగినంత, తాలింపుకి - జీలకర్ర, ఆవాలు, 3-4 వెల్లుల్లి ముక్కలు, ఎండు మిర్చి, కరివేపాకులు, 2 టీ స్పూన్ ల నూనె.
దోసకాయ పప్పు తయారు చేసే విధానం:
ఒక ప్రేస్స్యుర్ కుక్కర్ లో, కంది పప్పు, దోసకాయ ముక్కలు, తరిగిన ఉల్లిపాయ, తరిగిన టమాట, పచ్చిమిర్చి, అల్లం, పసుపు వేయాలి. అందులో 2 కప్పులు నీళ్ళు పోసి మూడు విజిల్స్ మోగే వరకు వండాలి. పప్పు బాగా ఉడికే వరకి వండాలి. ఒక కడాయిలో నూనె వేడి చేసి అందులో జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి,ఎండు మిర్చి, కరివేపాకు వేసి కాసేపు తాలింపు వేయాలి. ఈ తాలింపుని ఉడికిన పప్పు మిశ్రమంలో వేసి మరి కొన్ని నిమిషాలు వండాలి. అంతే దోసకాయ పప్పు మీకోసం సిద్ధం.