ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం దోసకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే దోసకాయ పచ్చడి మీ సొంతం.
దోసకాయ పచ్చడి కి కావలసిన పదార్ధాలు:
ఒక చిన్న దోసకాయ, కొంచెం చింతపండు, 7-8 పచ్చి మిరపకాయలు, ఉప్పు తగినంత, ఒక టీ స్పూన్ పసుపు.
దోసకాయ పచ్చడి తయారు చేసే విధానం:
ముందుగా దోసకాయ కడిగి దాని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. కొంచెం చింతపండును నీళ్ళల్లో నానబెట్టాలి. తరువాత నానబెట్టిన చింతపండు, పచ్చి మిరపకాయలు, పసుపు, ఉప్పు మెత్తని పేస్టు లాగ గ్రైండ్ చేసుకోవాలి. ఇపుడు ముందుగా కోసుకున్న దోసకాయ ముక్కలను ఈ పేస్టులో కలిపేయాలి. ఆ తరువాత ఆవాలు నూనె లో తాలింపు వేసి పచ్చడిలో కలిపేయాలి. అంతే దోసకాయ పచ్చడి రెడీ.