Home » Telugu Recipes » Homemade దొండకాయ వేపుడు cooking recipe
GumaGumalu Recipes
Recipes Food Court Specials Andhra Recipes How To Cook Cooking School Blog  

About Telugu Recipes

దొండకాయ వేపుడు


ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం దొండకాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే దొండకాయ వేపుడు మీ సొంతం.

దొండకాయ వేపుడు కి కావలసిన పదార్ధాలు:

1 కిలో దొండకాయలు, 2 ఉల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్ ల బటానీలు జీలకర్ర, ఆవాలు, 4 ఎండు మిరపకాయలు, కరివేపాకు, 1 స్పూన్ నూనె తగినంత ఉప్పు.

దొండకాయ వేపుడు తయారు చేసే విధానం:

ముందుగా దొండకాయలను కడిగి గుండ్రటి ఆకారంలో తరగాలి. తరువాత ఎండు మిరపకాయలు, జీలకర్ర, బటానిలను పౌడర్ గా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె పోసి అందులో ఆవాలు, కరివేపాకు, తరిగిన దొండకాయ ముక్కలు, తరిగిన ఉల్లిపాయలు, తగినంత ఉప్పు వేసి దొండకాయలు మృదువుగా వేగే వరకి వేయించాలి. ఇందులో మనం ముందుగా చేసుకున్న ఆవాల పౌడర్ ను వేసి మరో ఐదు నిముషాలు వండాలి. అంతే, నూరూరించే దొండకాయ వేపుడు రెడీ.

Search Recipes (over 5000 recipes)
 
Home Remedies

Recipes - Specials - Food Court - Ingredient Glossary - Recipe Aricles - Health Remedies - Home
All Rights Reserved. Copyright 2010 GumaGumalu.com