ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం దొండకాయ ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే దొండకాయ ఉల్లికారం మీ సొంతం.
దొండకాయ ఉల్లికారం కి కావలసిన పదార్ధాలు:
15 -20 దొండకాయలు, రెండు ఉల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ నూనె, ఉప్పు తగినంత.
దొండకాయ ఉల్లికారం తయారు చేసే విధానం:
ముందుగా దొండకాయలను మధ్యలోంచి నిటారుగా కోసుకోవాలి. తరువాత ఒక పాత్రలో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కారం, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. కలిపిన ఉల్లిపాయ మిశ్రమాన్ని దొండకాయలో పెట్టాలి. ఒక కడాయిలో నూనె పోసి మరిగించాలి. ఇప్పుడు ఉల్లికారం పట్టించిన దొండకాయలను అందులో వేసి దోరగా వేయించాలి. ఇక ఘుమఘుమలాడే ‘దొండకాయ ఉల్లికారం’ తయార్.