ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం దీపావళి స్పెషల్ చాక్లెట్ బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే దీపావళి స్పెషల్ చాక్లెట్ బర్ఫీ మీ సొంతం.
దీపావళి స్పెషల్ చాక్లెట్ బర్ఫీ కి కావలసిన పదార్ధాలు:
కోకా(చాక్లెట్) పౌడర్ - 4 స్పూన్స్
మైదా - 4 కప్స్
నెయ్యి - 6 స్పూన్స్
పాలు - 4 కప్స్ (బాగా మరిగించినవి)
జీడిపప్పు - సరిపడ (చిన్న ముక్కలు)
పంచదార - 5 కప్స్
నీరు - 3 కప్స్
దీపావళి స్పెషల్ చాక్లెట్ బర్ఫీ తయారు చేసే విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందసాటి పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి వేడయ్యాక మైదా పిండి అందులో వేసి ఫ్రై చేయాలి. మరొక స్టౌ మీద ఒక గిన్నె పెట్టి అందులో నీరు పోసి అందులో పంచదార వేసి పాకం పట్టాలి. పాకం తయారైయ్యే లోపు పాన్ లో పాలు పోసి అందులో కోకా పౌడర్ వేసి తక్కువ మంట మీద కాచి పక్కన పెట్టాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకొన్న మైదా, కోకాపౌడర్, నీళ్లు అన్ని కలిపి చిక్కబడే వరకూ కలియ బెడుతూ ఉడికించాలి.
ఈ మిశ్రమం చిక్క బడ్డాక పంచదార పాకంను, జీడిపప్పును జత చేసి కలియబెట్టాలి. ఈ మిశ్రమం బాగా చిక్క బడ్డాక ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని దాని మీద నెయ్యి రాసి అందులో కోకా మిక్స్ అందులో పోసి దాని మీద మరికొద్దిగా కోకా పౌడర్ ను చల్లి ఒక రెండు గంటల సేపు బాగా చల్లగా ఆరనివ్వాలి. ఆరిన తర్వాత కావలసిన ఆకారంలో కట్ చేసి సర్వ్ చేయాలి అంతే తియ్య తియ్యని చాక్లెట్ బర్ఫీ రెడీ.