ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం తోటకూర పకోడీలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే తోటకూర పకోడీలు మీ సొంతం.
తోటకూర పకోడీలు కి కావలసిన పదార్ధాలు:
తోటకూర - 2 కట్టలు
సెనగపిండి - 1/4 కేజీ
బియ్యంపిండి - 2 స్పూన్స్
నూనె - సరిపడ
అల్లం - చిన్నముక్క
ఉప్పు - తగినంత
పచ్చిమిర్చి- 4
జీలకర్ర పొడి - 1/2 స్పూన్
సోడా ఉప్పు - చిటికెడు
కరివేపాకు - కొద్దిగా
తోటకూర పకోడీలు తయారు చేసే విధానం:
ముందుగా పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర పొడి, ఉప్పు వేసి మిక్సీలో పేస్ట్ గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత శుభ్రం చేసుకున్న తోటకురను కరివేపాకును ఓ గిన్నెలోకి సన్నగా కట్ చేసి ఉంచుకోవాలి.
తరువాత అందులో సెనగపిండి, ఉప్పు, బియ్యంపిండి, సోడా ఉప్పు వేసి. కొద్దిగా నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. స్టవ్‌మీద బాణలి పెట్టి నూనె పోసి కాగిన తరువాత పిండిని చిన్న చిన్న ముద్దలుగా వేసి దోరగా వేయించి తీసేయాలి. అంతే రుచికరమైన పకోడీలు రెడీ