ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం డ్రైఫ్రూట్ బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే డ్రైఫ్రూట్ బిస్కెట్స్ మీ సొంతం.
డ్రైఫ్రూట్ బిస్కెట్స్ కి కావలసిన పదార్ధాలు:
మైదా పిండి - 1/2 కేజీ
డాల్డా -150 గ్రా
పంచదారపొడి - 200 గ్రా
కోడిగుడ్లు -రెండు
బాదంపప్పులు - 100 గ్రా
టూటీఫ్రూటీలు -100 గ్రా
వెనిల్లా ఎసెన్స్ - 1 స్పూన్
బేకింగ్ పౌడర్ - 1 స్పూన్
డ్రైఫ్రూట్ బిస్కెట్స్ తయారు చేసే విధానం:
ముందుగ డాల్డాలో పంచదార పొడి వేసి బాగా గిలకొట్టాలి. కోడిగుడ్డుసొనలో వెనిల్లా ఎసెన్స్ వేసి బాగా కలపాలి. ఓ గిన్నెలో మైదా పిండి, చిన్నచిన్న ముక్కలుగా కోసిన బాదంపప్పు, టూటీఫ్రూటీలు, బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపాలి. తరువాత మైదా పిండిలో డాల్డా మిశ్రమం, కోడిగుడ్డు సొనలు కూడా వేసి బాగా కలిపి పిండిముద్దలా చేసి 10 నిమిషాలు కదపకుండా అలాగే పక్కన ఉంచాలి.
తరువాత పిండిని ముద్దలుగా విడదీసి రెండు చపాతీల మందాన చేసి డైమండ్ లేదా చతురస్రాకారంలో ముక్కలుగా కోయాలి. ఓ వెడల్పాటి ట్రేలో అడుగున వెన్న రాసి దానిపైన కొద్ది మైదా పిండి పలుచగా చల్లి, కోసిన ఈ ముక్కల్ని అందులో సర్ది, ఓవెన్‌లో 350 డిగ్రీల ఫారన్‌హీట్ డిగ్రీల వద్ద 15 నిమిషాలపాటు బేక్ చేసి తీయాలి. చల్లారాక డబ్బాలో సర్దితే 15 రోజులు నిల్వ ఉంటాయి.