ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం టొమోటో హల్వా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే టొమోటో హల్వా మీ సొంతం.
టొమోటో హల్వా కి కావలసిన పదార్ధాలు:
ఎర్రగా పండిన టొమోటోలు - 10
పంచదార- 2 కప్పులు
నెయ్యి - 1 కప్పు
జీడిపప్పు, బాదంపప్పు- సరిపడ
బొంబాయి రవ్వ- 1 కప్పు
యాలకుల పొడి - కొద్దిగా
టొమోటో హల్వా తయారు చేసే విధానం:
ముందుగా టొమోటో పండ్లను నీళ్ళలో ఉడికించి చక్కటి గుజ్జు తీయాలి. తరువాత బాణలిలో నెయ్యి పోసి కాగాక జీడిపప్పు, బాదంపప్పు వేయించి పక్కకు తీసుకోవాలి. ఆ తరువాత అదే బాణలిలో బొంబాయి రవ్వను వేసి దోరగా వేయించాలి. మరో పాత్రలో రెండు కప్పుల నీరు తీసుకుని మరిగించి, వేయించిన బొంబాయి రవ్వను కలపాలి.
ఇది దగ్గరపడిన తరువాత టొమోటో గుజ్జు, పంచదార, జీడిపప్పు, బాదంపప్పు, నెయ్యి వేసి కలియబెట్టాలి. చివర్లో యాలకుల పొడి వేసి బాగా కలిపి దింపి ముందుగ నెయ్యి రాసిన ప్లేట్ కి తీసుకోని చల్లారిన తరువాత మనకు కావలసిన ఆకారంలో కట్ చేసుకోవాలి. అంతే రుచికరమైన టొమోటో హల్వా రేడి.