ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం టమాటో రైస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే టమాటో రైస్ మీ సొంతం.
టమాటో రైస్ కి కావలసిన పదార్ధాలు:
బియ్యం -1 కప్పు
టమాటాలు - 4
ఉల్లిపాయలు- 2
పచ్చిమిర్చి -2
అల్లం వెల్లుల్లి -1/2 స్పూన్
కొత్తిమీర- కొంచం
ఉప్పు - రుచికి సరపడ
నూనె - సరిపడ
నెయ్యి - 3 స్పూన్స్
పల్లీలు - అర కప్పు
జీడిపప్పు- 2 స్పూన్స్
పసుపు -చిటికెడు
టమాటో రైస్ తయారు చేసే విధానం:
ముందుగ ఒక కప్పు బియ్యనికి రెండు కప్పుల నీళ్ళు పోసి కొంచెం పలుకుగా ఉండేలా అన్నం వండి ఒక ప్లేట్ లోకి తీసి ఆరబెట్టుకోవాలి. ఇప్పడు టొమోటాలను, ఉల్లి పాయలను తరిగి పక్కన పెట్టుకోవాలి. తరువాత బాణలిలో నూనె పోసి కాగాక ఉల్లిపాయముక్కలు కూడా వేసి వేగించాలి. వేగాక అల్లం వెల్లుల్లి పేస్టూ, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించాలి.
వీటిని చల్లారిన తరువాత మిక్సి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి అందులో నెయ్యి, వేసి కాగాక పల్లీలు వేయించి.పక్కకు తీసుకోవాలి.అందులోనే పోపు గింజలు వేసి వేగాక టమాటో పేస్ట్ వేసి సరిపడ ఉప్పు , కరం, పసుపు వేసి రెండు నిముషాలు ఉంచి దింపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అన్నములో బాగా కలిసేలాగ కలుపుకోవాలి. ఇప్పుడు పైన పల్లీలు, జీడిపప్పు, కొత్తిమీరతో అలంకరించుకోవాలి. దీనిని పెరుగు పచ్చడి తో తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.