Home » Telugu Recipes » Homemade టమాటో పచ్చడి cooking recipe
GumaGumalu Recipes
Recipes Food Court Specials Andhra Recipes How To Cook Cooking School Blog  

About Telugu Recipes

టమాటో పచ్చడి


ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం టమాటో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే టమాటో పచ్చడి మీ సొంతం.

టమాటో పచ్చడి కి కావలసిన పదార్ధాలు:

పచ్చి టమోటాలు- 1/2 కేజి
నువ్వుల పొడి -4 స్పూన్స్
పచ్చిమిర్చి - 10
వెల్లుల్లి - 10
జీలకర్ర - 2 స్పూన్స్
చింతపండు- కొద్దిగ
నూనె -2 స్పూన్స్
పల్లిల పొడి -2 స్పూన్స్

టమాటో పచ్చడి తయారు చేసే విధానం:

ముదుగా కడాయిలో నూనె వేసి పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్రను వేయించి పక్కకు తీసుకోవాలి. తరువాత మిగిలిన నూనెలో నాలుగు ముక్కలుగా తరిగిన పచ్చి టొమోటో కాయల్ని వేసి మగ్గింఛి దింపుకోవాలి.
చల్లారాక మిక్సీలో నువ్వుల పొడి, పల్లిల పొడి, జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, నానబెట్టి ఉంచుకున్న చింతపండు వేసి మెత్తగా చేసుకుని తరువాత టొమోటో ముక్కలు, ఉప్పు వేసి రుబ్బుకోవాలి. దీనిని వేడి వేడి అన్నంతో కానీ , దోసె, ఇడ్లీలలో కానీ తీసుకోవచ్చు.

Search Recipes (over 5000 recipes)
 
Home Remedies

Recipes - Specials - Food Court - Ingredient Glossary - Recipe Aricles - Health Remedies - Home
All Rights Reserved. Copyright 2010 GumaGumalu.com