Home » Telugu Recipes » Homemade టమాటాచోళేకర్రీ cooking recipe
GumaGumalu Recipes
Recipes Food Court Specials Andhra Recipes How To Cook Cooking School Blog  

About Telugu Recipes

టమాటాచోళేకర్రీ


ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం టమాటాచోళేకర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే టమాటాచోళేకర్రీ మీ సొంతం.

టమాటాచోళేకర్రీ కి కావలసిన పదార్ధాలు:

కాబూలీ శనగలు - 1 కప్పు
వంకాయలు - 4
అల్లం పేస్టు - 1 స్పూన్
గరం మసాల - కొద్దిగ
ధనియాల పొడి - 1 స్పూన్
ఉప్పు -సరిపడ
నూనె-సరిపడ
టమాటోలు - 4
ఉల్లిపాయలు -2
కారం- 1 స్పూన్
పసుపు - కొద్దిగ
కొత్తిమీర -కొద్దిగ

టమాటాచోళేకర్రీ తయారు చేసే విధానం:

ముందుగా10 గంటల ముందు శనగలు నానపెట్టి ఉంచాలి. తరువాత ఉల్లిపాయలను, టమోటాలను సన్నగా కట్ చేసుకోవాలి. వంకాయలు కూడా కట్ చేసి ఉప్పు నీటిలో వేయాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి అందులో నూనె పోసి కాగాక పోపు గింజలు, ఉల్లిపాయ ముక్కలు వేసి 2 నిముషాలు వేయించాలి. వేగిన తరువాత అల్లం, వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, టమోటో ముక్కలు వేసి మరో వేసి 2 నిముషాలు వేయించాలి.
తరువాత వంకాయ ముక్కలు, శనగలువేసి సరిపడ ఉప్పు వేసి బాగా కలిపి సన్నని మంట పై ఉడికించాలి. అవసరమైతే కొన్ని నీళ్ళు కూడా వెయ్యచ్చు. ఇప్పుడు గ్రేవీ చిక్కబడి శనగలు ఉడికిన తరువాత కొద్దిగ గరం మసాల, కొత్తిమీర వేసి దించుకోవాలి. అంతే వేడి వేడి టమాటా చోళే కర్రీ తయార్.

Search Recipes (over 5000 recipes)
 
Home Remedies

Recipes - Specials - Food Court - Ingredient Glossary - Recipe Aricles - Health Remedies - Home
All Rights Reserved. Copyright 2010 GumaGumalu.com