ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం జై పూరి చాట్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే జై పూరి చాట్ మీ సొంతం.
జై పూరి చాట్ కి కావలసిన పదార్ధాలు:
బంగాళాదుంపలు -1/2 కేజీ
ఛాట్ మసాలా- 2 స్పూన్స్
కొత్తిమీర తురుము - తగినంత
కారం పొడి- 2 స్పూన్స్
ఉప్పు- తగినంత
చింతపండు గుజ్జు - 2 స్పూన్స్
పెరుగు - 2 స్పూన్స్
ఉల్లిపాయ ముక్కలు - 1/2 కప్పు
టొమోటో ముక్కలు - 1/2 కప్పు
కారంపూస-1కప్పు
ఉడికించిన బటనిలు 100 గ్రా
జై పూరి చాట్ తయారు చేసే విధానం:
ముందుగా బంగాళాదుంపలు, బటనిలు మెత్తగా ఉడికించి గుజ్జులాగా చేసుకోవాలి. తరువాత బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి బంగాళా దుంప మిశ్రమాన్ని వేసి కొద్దిగా నీళ్ళు పోసి కారం, ఉప్పు , ఛాట్ మసాల, చింతపండు గుజ్జు, కారంపూస, వేసి ఈ మిశ్రమాన్ని మెత్తగా కలుపుకోవాలి.
తరువాత ఈ మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్స్‌లో సర్ది పైన ఉల్లిపాయ ముక్కలు, టొమోటో ముక్కలు, కొత్తిమీర తురుము, పెరుగు వేసి వేడిగ అతిథులకు అందించాలి.