ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం చికెన్ బిర్యాని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే చికెన్ బిర్యాని మీ సొంతం.
చికెన్ బిర్యాని కి కావలసిన పదార్ధాలు:
బాస్మతి బియ్యం - 1 కేజీ
ఉల్లి పాయలు - 4
పచ్చి మిర్చి - 6
పుదీనా- 1 కట్ట
చికెన్ - 1 కేజీ
కొత్తిమీర - 1 కట్ట
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 3 స్పూన్స్
ధనియాలపొడి - 3 స్పూన్స్
గరం మసాల - 1 స్పూన్
సాజిర - 1 స్పూన్
యాలకులు - 4
బిర్యాని ఆకు - కొంచం
నూనె - 100 గ్రా
చిక్కటి పెరుగు -100 గ్రా
నిమ్మకాయ - 1
కారం - సరిపడ
ఉప్పు సరిపడ
చికెన్ బిర్యాని తయారు చేసే విధానం:
ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి దానిలో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాల పొడి, పెరుగుతో కలిపి పక్కన ఉంచాలి. తరువాత స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టి నూనె పోసి కాగాక అందులో సన్నగా తురిమిన ఉల్లిపాయ ముక్కలు, బిర్యాని ఆకు, పచ్చి మిర్చి, యాలకులు, వేసి నూనెలో బాగా వేయించాలి. వేగాక ఈ చికెన్ మిశామాన్ని అందులో వేసి 20 నిముషాలు మూత పెట్టి ఉడికించాలి.
తరువాత అందులో ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పుల నీళ్ళు పోసి మరిగించాలి. నీళ్ళు,మరుగుతున్నప్పుడు బాస్మతి బియ్యం వేయాలి. అందులో నీళ్ళు ఇంకిపోయేవరకు చిన్న మంట మీద పెట్టి ఉంచాలి. అన్నం పలుకుగా ఉన్నప్పుడే దించేయాలి. ఇప్పుడు అన్నంని ఒక వెడల్పాటి ప్లేట్ లోకి తీసుకోని చికెన్ కలిసేటట్టుగా మెల్లిగా కలపాలి. చివరిగా కొత్తిమీర చల్లి దీనిని పెరుగు పచ్చడి గాని నాన్ వెజ్ కర్రీతో గాని కలుపుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.