ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం చికెన్ బర్గర్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే చికెన్ బర్గర్స్ మీ సొంతం.
చికెన్ బర్గర్స్ కి కావలసిన పదార్ధాలు:
చికెన్ - 1/2 కేజీ
కార్న్‌ఫ్లోర్ - 3 స్పూన్స్
చిల్లీ సాస్ - 3 స్పూన్స్
మిరియాలపొడి-1/2 స్పూన్
అజినమోటో - 1/2 స్పూన్
తరిగిన ఛీజ్ స్లైసులు - 20
నూనె - సరిపడ
బర్గర్ బన్స్ - తగినన్ని
చికెన్ బర్గర్స్ తయారు చేసే విధానం:
ముందుగా చికెన్ ని బాగా శుబ్రంగా కడిగి అందులో కొంచెం ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి. ముక్క మెత్తగా ఉడికిన తరువాత తీసి, ఎముకల నుండి మాంసం తీసి వేరు చేసి, మెత్తగా కైమాలా కొట్టుకోవాలి. ఇందులో చిల్లీసాస్, కార్న్‌ప్లోర్, మిరియాలపొడి, అజినమోటో కలిపి ముద్దగా చేయాలి.
ఈ మిశ్రమాన్ని పలుచని పాపడ్‌లు మాదిరిగా చేసి నూనెలో వేయించాలి. బర్గర్ బన్నులను తీసుకుని, రెండు స్లయిసులుగా కోసుకోవాలి. కింది స్లయిసుమీద ఒక ఛీజ్ స్లయిసును దానిపై చికెన్ కైమా వడను, ఆపైన మరో ఛీజ్ స్లయిసు వుంచి పైన మరో బన్ను ముక్కను పెట్టి మొత్తం బర్గర్‌ను పిన్నుతో గుచ్చి వేడిగా సర్వ్ చేయాలి. అంతే చిల్లీ చికెన్ బర్గర్స్ తయార్