ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం చింత చిగురు పప్పు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే చింత చిగురు పప్పు మీ సొంతం.
చింత చిగురు పప్పు కి కావలసిన పదార్ధాలు:
చింత చిగురు - 100 గ్రాములు
కందిపప్పు - 1 కప్పు
పచ్చిమిర్చి - 6
కారం - 1 స్పూన్
పసుపు - కొద్దిగా
ఉప్పు - సరిపడ
నూనె - సరిపడ
పోపు గింజలు - 2 స్పూన్స్
చింత చిగురు పప్పు తయారు చేసే విధానం:
ముందుగా పప్పును బాగా కడిగి కుక్కర్లో వేసి సరిపడ నీళ్ళు పోసి కొంచం పలుకుగ ఉడికించాలి. ఇప్పుడు చింత చిగురును పుల్లలు లేకుండా శుభ్రపరచి, నీటిలో కడిగి సన్నగా తరిగిన పచ్చిమిర్చిలను కలిపి పప్పులో వేసి ఉడికించాలి. పప్పు, ఆకు బాగా ఉడికిన తరువాత దించి, పప్పులోని నీటిని వంపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో సరిపడా ఉప్పువేసి పప్పుగుత్తితో మెత్తగా మెదుపుకోవాలి.
ఆ తరువాత పక్కన పెట్టుకున్న పప్పు నీటిని కలిపి కారం, పసుపు వేసి కడాయిలో నూనె పోసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, కాస్తంత ఇంగువ వేసి పోపు పెట్టాలి. పోపు బాగా వేగిన తరువాత మెదిపి ఉంచుకున్న పప్పును ఇందులో కలపాలి. అంతే వేడి వేడి చింత చిగురు పప్పు రేడి దీన్ని వేడి వేడి అన్నంలోనూ, చపాతీల్లోనూ తింటే చాలా రుచిగా ఉంటుంది.