ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం చింతపండు పులిహొర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే చింతపండు పులిహొర మీ సొంతం.
చింతపండు పులిహొర కి కావలసిన పదార్ధాలు:
బియ్యం - 2 కప్పులు
చింతపండు - 100 గ్రా
నూనె - 100 గ్రా
ఎండుమిర్చి -6
పచ్చిమిర్చి -3
పసుపు - 1
నిమ్మకాయలు -2
పల్లీలు -50 గ్రా
సెనగపప్పు -2 స్పూన్స్
మినపప్పు -2 స్పూన్స్
ఆవాలు -1 స్పూన్
జీలకర్ర - 1 స్పూన్
ఇంగువ - చిటికెడు
కరివేపాకు - కొంచం
ఉప్పు -సరిపడ
చింతపండు పులిహొర తయారు చేసే విధానం:
ముందుగ బియ్యాన్ని కడిగి నాలుగు కప్పులు నీళ్ళు పోసి కాస్త పోదునుగా అన్నం వొండుకోవాలి.తరువాత చింతపండుని పది నిముషాలు నానపెట్టి, చిక్కటి గుజ్జు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి నూనె పోసి కగాక పల్లీలు వేసి వేయించి పక్కకు తీసుకోవాలి.
తరువాత అందులో ఆవాలు, జీలకర్ర, సెనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి వేగాక చింతపండు గుజ్జు, నిమ్మరసం, పసుపు, సరిపడ ఉప్పు వేసి బాగా మరిగించాలి. నూనె పైకి తేలేవరకు ఉంచి దింపుకోవాలి. చల్లారిన తరువాత ఈ మిశ్రమాన్ని చల్లార్చిన అన్నములో కొద్ది కొద్దిగా వేస్తూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పైన వేయించిన జీడిపప్పు, కొత్తిమీర వేసి మూత పెట్టి పది నిమిషాల తరువాత తింటే
చాలా రుచిగా ఉంటుంది.