ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం చింతపండు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే చింతపండు పచ్చడి మీ సొంతం.
చింతపండు పచ్చడి కి కావలసిన పదార్ధాలు:
చింతపండు -100 గ్రా
ఎండు మిర్చి - 12
పల్లీలు - 50 గ్రా
ధనియాలు - 1 స్పూన్
ఆవాలు - 1 స్పూన్
మెంతులు -1/2 స్పూన్
జీలకర్ర- 1 స్పూన్
నూనె - 1 స్పూన్
ఉప్పు - సరిపడ
చింతపండు పచ్చడి తయారు చేసే విధానం:
ముందుగ చింతపండుని కడిగి నానపెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద బాణలి పెట్టి నూనె లేకుండా పల్లీలు వేయించి పక్కకు తీసుకోవాలి. తరువాత అదే బాణలిలో నూనె వేసి కాగాక ఎండు మిర్చి వేయాలి.
అవి కొద్దిగా వేగాక ధనియాలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి పక్కకు తీసుకోని చల్లారిన తరువాత ముందుగా వేయించిన పల్లీలు, మిరపకాయలు కలిపి పొడి చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు, సరిపడ ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకొని పక్కకు తీసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే చింతపండు పచ్చడి తయార్