Home » Telugu Recipes » Homemade చక్కర పొంగలి cooking recipe
GumaGumalu Recipes
Recipes Food Court Specials Andhra Recipes How To Cook Cooking School Blog  

About Telugu Recipes

చక్కర పొంగలి


ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం చక్కర పొంగలి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే చక్కర పొంగలి మీ సొంతం.

చక్కర పొంగలి కి కావలసిన పదార్ధాలు:

బియ్యం - 1 /2 కేజీ
ఎండుకొబ్బరి ముక్కలు- 1/2 కప్పు
పెసరపప్పు - 1 కప్పు
కాచిన పాలు - 1 కప్పు
జీడిపప్పు - 50 గ్రా
పంచదార -300 గ్రా
కిస్‌మిస్- 50 గ్రా
నెయ్యి - 100గ్రా
పచ్చ కర్పూరం - చిటికెడు

చక్కర పొంగలి తయారు చేసే విధానం:

బియ్యం, పెసరపప్పులను బాగా కడిగి సరిపడ నీళ్ళు పోసి మెత్తగా ఉడికించి పక్కనుంచాలి. తరువాత ఓ పాత్రలో నెయ్యి పోసి కాగాక కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్‌మిస్‌లను వేసి రెండు నిమిషాలపాటు ఎర్రగా వేయించాలి.
తరువాత అందులో పంచదార, పాలు, నెయ్యి, వేయించిన జీడిపప్పు, కొబ్బరి ముక్కలు, కిస్‌మిస్‌లు, చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసి పంచదార బాగా కరిగిన తరువాత కలిపి దించేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే చక్కెర పొంగలి సిద్ధమైనట్లే..!

Search Recipes (over 5000 recipes)
 
Home Remedies

Recipes - Specials - Food Court - Ingredient Glossary - Recipe Aricles - Health Remedies - Home
All Rights Reserved. Copyright 2010 GumaGumalu.com