ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం గోధుమ పిండి హల్వా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే గోధుమ పిండి హల్వా మీ సొంతం.
గోధుమ పిండి హల్వా కి కావలసిన పదార్ధాలు:
1 గ్లాస్ గోధుమ పిండి, 1 గ్లాస్ పంచదార, 1 గ్లాస్ నెయ్యీ, 1 గ్లాస్ కాగిన పాలు, 50 గ్రాముల జీడిపప్పు.
గోధుమ పిండి హల్వా తయారు చేసే విధానం:
ఒక ప్యాన్ లో నెయ్యీ పోసి కాగిన తరువాత జీడిపప్పు వేసి దోరగా వేగనివ్వాలి. తరువాత వేగిన జీడిపప్పు తీసి ప్లేటులో పెట్టుకోవాలి. తరువాత అదే నెయ్యీలో గోధుమ పిండి వేసి బాగా కలిపి దోరగా వేగనివ్వాలి. దానిలోనే పంచదార వేసి 2 నిమిషాలు వేగనివ్వాలి. దానిలోనే పాలు పోసి బాగా కలిపాలి. ఇదంతా సన్న మంట మీదనే చెయ్యాలి. గోధుమ పిండి హల్వా దగ్గరకి అయ్యే అంతవరకూ కలుపుతూనే ఉండాలి. నెయ్యీ విడిపడే అంతవరకూ కలపాలి .అంతే గోధుమ పిండి హల్వా రెడీ . దీన్ని ఒక మంచి బౌల్లో పెట్టుకోని వేగిన జీడిపప్పు కలుపుకుంటే సరి.