Home » Telugu Recipes » Homemade గోధుమరవ్వ పాయసం నవరాత్రి స్పెషల్ cooking recipe
GumaGumalu Recipes
Recipes Food Court Specials Andhra Recipes How To Cook Cooking School Blog  

About Telugu Recipes

గోధుమరవ్వ పాయసం నవరాత్రి స్పెషల్


ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం గోధుమరవ్వ పాయసం నవరాత్రి స్పెషల్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే గోధుమరవ్వ పాయసం నవరాత్రి స్పెషల్ మీ సొంతం.

గోధుమరవ్వ పాయసం నవరాత్రి స్పెషల్ కి కావలసిన పదార్ధాలు:

గోధుమరవ్వ - 1కప్పు
వెన్నతీయని పాలు - 2 కప్పులు
మిల్క్‌మెయిడ్ - 1/2 కప్పు
పంచదార - 1కప్పు
నెయ్యి - 1/2 కప్పు
యాలకుల పొడి - 1స్పూన్
డ్రైఫ్రూట్స్ - సరిపడ

గోధుమరవ్వ పాయసం నవరాత్రి స్పెషల్ తయారు చేసే విధానం:

ముందుగ బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్ వేయించి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అందులోనే రవ్వను వేయించాలి. తరువాత స్టవ్ మీద పాలు పెట్టి మరిగించాలి. ఇప్పుడు అందులో పంచదార వేసి కలుపుతూ ఉండాలి. పంచదార కరిగిన తరువాత రవ్వ, మిల్క్‌మెయిడ్, నెయ్యి, వేసి కలుపుతూ ఉండాలి.
రవ్వ ఉడికిన తరువాత దించేందుకు ముందుగా యాలకులపొడి, కుంకుమపువ్వు, డ్రైఫ్రూట్స్ అన్నీ వేసి కలిపితే వేడి వేడి గోధుమరవ్వ పాయసం తయార్ పండుగ పూట వెరైటీగా ఉండే ఈ గోధుమరవ్వ పాయసాన్ని మీరూ ట్రై చేయండి.

Search Recipes (over 5000 recipes)
 
Home Remedies

Recipes - Specials - Food Court - Ingredient Glossary - Recipe Aricles - Health Remedies - Home
All Rights Reserved. Copyright 2010 GumaGumalu.com