ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే గోంగూర పచ్చడి మీ సొంతం.
గోంగూర పచ్చడి కి కావలసిన పదార్ధాలు:
గోంగూర - 4 కట్టలు
ఎండుమిర్చి - 12
ఆవాలు - 1 స్పూన్
జీలకర్ర - 1 స్పూన్
మెంతులు -1 /2 స్పూన్
ధనియాలు -1 స్పూన్
నూనె - సరిపడ
ఉప్పు - సరిపడ
గోంగూర పచ్చడి తయారు చేసే విధానం:
ముందుగా గోంగూర ఆకులను కడిగి ఆరనివ్వాలి. తరువాత బాణలిలో ఒక స్పూన్ నూనె వేసి
ఎండుమిర్చి వేగనివ్వాలి కొంచెం వేగాక అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు మరియు ధనియాలు కూడా
వేయించి పక్కన ఉంచుకోవాలి.
బాణలిలో గోంగూర తో పాటు మరోక స్పూన్ నూనె వేసి బాగా ఉడికించాలి.
బాగా చల్లారిన తరువాత ఇప్పుడు ఉడికించిన గోంగూరతో పాటు వేయించిన ఎండు మిరపకాయలు,
కూడా వేసి ఈ రెండింటికి ఉప్పు కలిపి మిక్సి చేసి పక్కకు తీసుకోవాలి.
అంతే 10 నిమిషాలలో ఎంతో రుచిగా ఉండే గోంగూర పచ్చడి రేడి.
దీనిని మనం వేడి వేడి అన్నముతో కాని, దోస, ఇడ్లీతో కానీ
తీసుకోవచ్చు.