ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం గుమ్మడి కాయ హల్వా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే గుమ్మడి కాయ హల్వా మీ సొంతం.
గుమ్మడి కాయ హల్వా కి కావలసిన పదార్ధాలు:
గుమ్మడిపండు - 1 (చిన్నది)
పంచదార,బెల్లంపొడి కలిపి - 1/2 కేజీ
జీడిపప్పు -సరిపడ
యాలకులపొడి - 1 స్పూన్
కిస్మిస్ - సరిపడ
గసగసాలు - 1 స్పూన్
నెయ్యి - 50 గ్రా
గుమ్మడి కాయ హల్వా తయారు చేసే విధానం:
ముందుగా పండిన గుమ్మడి పండును శుభ్రం చేసి పెద్ద ముక్కలుగా కోసి కుక్కరులో వేసి కొన్ని నీళ్ళు పోసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఉడికిన ముక్కలను చెక్కు తీసి గుజ్జును మాత్రమే చిదిమి పక్కన ఉంచుకోవాలి. తరువాత ఒక బాణలిలో నెయ్యి వేసి దానిలో జీడిపప్పు, కిస్మిస్, గసాల వేసి వేయించి గుమ్మడి ముద్ద కూడా వేసి వేయించాలి.
తరువాత బెల్లం పంచదార కూడా వేసి మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ భాగా ఉడకనివ్వాలి. ఇలా కొంచెం ముదురు పాకం రాగానే యాలకుల పొడి వేసి దించి నెయ్యి రాసిన పళ్ళెంలో పోసి సమానంగా చేసి చల్లారిన తరువాత ముక్కలుగా కోసుకోవాలి. అంతే గుమ గుమలాడే గుమ్మడి హల్వా తయార్. ఈవిధముగా నెయ్యి పైకి తేలిన గుమడి హల్వా చల్లారాక తింటే చాల రుచిగా ఉంటుంది. మరియూ 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది.