ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం గుమ్మడికాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే గుమ్మడికాయ పప్పు మీ సొంతం.
గుమ్మడికాయ పప్పు కి కావలసిన పదార్ధాలు:
కందిపప్పు - 1 కప్పు
గుమ్మడి ముక్కలు - 1 కప్పు
చింతపండు - కొద్దిగా
పచ్చిమిర్చి - 4
ఉల్లిపాయ - 1
కారం - సరిపడ
పసుపు - సరిపడ
పోపు గింజలు - 1 స్పూన్
ఉప్పు - సరిపడ
కొత్తిమీర- కొద్దిగా
నూనె - సరిపడ
మీగడ -2 స్పూన్స్
కొబ్బరి తురుము - 2 స్పూన్స్
గుమ్మడికాయ పప్పు తయారు చేసే విధానం:
ముందుగా కందిపప్పు, గుమ్మడి ముక్కలు కుక్కర్లో వేసి సరిపడ నీళ్ళు పోసి బాగా ఉడికించాలి. తరువాత స్టౌమీద బాణలి పెట్టి బాగా వేడయ్యాక నూనె పోసి పోపు గింజలు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిరపకాయ తరుగులను వేసి దోరగా వేయించుకోవాలి.
తరువాత పప్పు మిశ్రమాన్ని అందులో వేసి ఉప్పు, కారం, పసుపు, చింత పండు రసం వేసి కొంచెం నీళ్ళు పోసి కాసేపు ఉడకించాలి. పదినిమిషాల తర్వార దించి ఓ పాత్రలోకి తీసుకుని కొత్తి మీర, మీగడ, కొబ్బరి చల్లాలి. అంతే వేడి వేడి గుమ్మడికాయ పప్పు తయార్.