ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే గుత్తి వంకాయ కూర మీ సొంతం.
గుత్తి వంకాయ కూర కి కావలసిన పదార్ధాలు:
వంకాయలు (చిన్నవి ) -1 /2 కేజీ
టమోట ముక్కలు - 1 కప్పు
ఉల్లిపాయ ముక్కలు -1 కప్పు
పచ్చిమిర్చి - 4
పల్లీలు - 100 గ్రా
కొబ్బరి పొడి -2 స్పూన్స్
ధనియాల పొడి - 1 స్పూన్
గరంమసాల పొడి -1/2 స్పూన్
కారం - సరిపడ
పసుపు -1/2 స్పూన్
చింతపండు - కొంచం
ఆవాలు -1/2 స్పూన్
జీలకర్ర -1 /2 స్పూన్
నూనె - 1 /2 కప్పు
కొత్తిమీర - కొంచం
ఉప్పు - సరిపడ
గుత్తి వంకాయ కూర తయారు చేసే విధానం:
ముందుగ పల్లీలు నూనె లేకుండా వేయించుకోవాలి. చల్లారిన తరువాత వేయించిన పల్లీలు, సగం కప్పు ఉల్లిపాయ ముక్కలు , సగం కప్పు టమోట ముక్కలు,పచ్చిమిర్చి, కొబ్బరి పొడి, ధనియాల పొడి, గరంమసాల పొడి, పసుపు, చింతపండు, ఉప్పు అన్ని కలిపి ముద్దగా మిక్సి చేసుకోవాలి. తరువాత వంకాయలు కడిగి నిలువుగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ముందుగ సిద్ధం చేసుకున్న మసాల ముద్దను వంకాయలలో కూర్చాలి. తరువాత బాణలిలో నూనె పోసి కాగిన తరువాత ఆవాలు, జీలకర్ర, మిగతా ఉల్లిపాయ, టమోట ముక్కలు వేసుకొని కొంచం వేగిన తర్వాత మసాల కూర్చి వంకాయలు కూడా వేసి తగినన్ని నీళ్ళు పోసి మూత పెట్టాలి. బాగా ఉడికిన తరువాత పులుసు దగ్గర పడ్డాక కొత్తిమీర చల్లుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ కూరరేడి దీనిని మనం వేడివేడి అన్నముతో కాని చపాతితో కానీ తీసుకోవచ్చు.