కావలసిన పదార్ధాలు:
రెండు పెద్ద ఖర్బూజాలు, అర కప్పు ఆరెంజ్ జూస్, ఒక కప్పు నిమ్మ రసం, 4 చుక్కలు ఖర్బూజా ఎస్సెన్స్.
తయారు చేసే విధానం:
ఖర్బూజా తొక్క తీసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఆ తరువాత మిగతా పదార్ధాలు, ఖర్బూజా ముక్కలు ఒక బ్లెండర్ లో వేసి బాగా బ్లెండ్ చేయాలి. తరువాత ఆ మిశ్రమాన్ని చల్లార్చండి. అంతే ఖర్బూజా షర్బత్ రెడీ.