ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం ఖర్జూర పాయసం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే ఖర్జూర పాయసం మీ సొంతం.
ఖర్జూర పాయసం కి కావలసిన పదార్ధాలు:
పాలు - 1/2 లీ
ఖర్జూరాలు - 10
పంచదార - 1 కప్పు
జీడిపప్పు - సరిపడ
బాదం పప్పు - కొద్దిగ
వాల్‌నట్స్ - కొద్దిగ
యాలకుల పొడి - కొద్దిగ
ఖర్జూర పాయసం తయారు చేసే విధానం:
ముందుగా ఖర్జూరాలలో గింజలు తీసేసి పావు కప్పు పాలలో ఖర్జూరాలు, జీడిపప్పు, బాదం పప్పు, వాల్‌నట్స్ ని రెండు గంటలసేపు నానబెట్టాలి. అవి బాగా నానిన తరువాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. మిగిలిన పాలను స్టవ్ మీద పెట్టి చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు అందులో పంచదార వేసి బాగా కలపాలి.
తరువాత ఇందులో గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని కలిపి అడుగు అంటకుండా బాగా కలిపి యాలకుల పొడి వేసి దించేయాలి. చల్లారిన తరువాత కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి సర్వ్ చేయాలి. ఖర్జూరాలతో తయారు చేసిన ఈ ఖీర్‌లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. తేలికగా జీర్ణం అవుతుంది. ఖర్జూరాలలో ఐరన్ మోతాదు ఎక్కువగా ఉండటంవల్ల ఎదిగే వయసు పిల్లలకు ఇది మంచి ఆహారం.