Home » Telugu Recipes » Homemade ఖర్జూరం కుడుములు cooking recipe
GumaGumalu Recipes
Recipes Food Court Specials Andhra Recipes How To Cook Cooking School Blog  

About Telugu Recipes

ఖర్జూరం కుడుములు


ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం ఖర్జూరం కుడుములు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే ఖర్జూరం కుడుములు మీ సొంతం.

ఖర్జూరం కుడుములు కి కావలసిన పదార్ధాలు:

బియ్యపు రవ్వ -1 కప్పు
పెసరపప్పు - 1/4 కప్పు
ఖర్జూరాలు - 15
కొబ్బరి తురుము - 1/4 కప్పు
నెయ్యి - సరిపడ
యాలకుల పొడి -చిటికెడు
మంచినీళ్ళు- 3 కప్పులు
పాలు - 3 కప్పులు

ఖర్జూరం కుడుములు తయారు చేసే విధానం:

ముందుగా నీళ్ళు, పాలు కలిపి స్టవ్ మీద పెట్టుకోవాలి. నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు పెసరపప్పును వేయాలి. పెసరపప్పు కొద్దిగా ఉడికిన తరువాత బియ్యపు రవ్వని పోసి ముద్ద కాకుండా కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం ఉడికిన తర్వాత దించి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఖర్జూరాన్ని చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి.
మెత్తగా అయిన ఖర్జూరంలో కొబ్బరి తురుము, యాలకుల పొడి, నెయ్యి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఉడికిన బియ్యపు రవ్వలో కలుపుకోవాలి. తర్వాత దీన్ని చిన్న ముద్దలుగా చుట్టుకోవాలి. ఆ తర్వాత వీటిని ఇడ్లీ కుక్కర్ లో పెట్టి 10 నిమిషాలు ఆవిరి మీద ఉడకనివ్వాలి. అంతే రుచిగా ఉండే ఖర్జూరం కుడుములు రేడి.
గమనిక : ఖర్జూరం వద్దనుకున్నవారు ఖర్జూరాన్ని కలుపుకోకుండా కూడా కుడుములు తయారు చేసుకోవచ్చు.

Search Recipes (over 5000 recipes)
 
Home Remedies

Recipes - Specials - Food Court - Ingredient Glossary - Recipe Aricles - Health Remedies - Home
All Rights Reserved. Copyright 2010 GumaGumalu.com