ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే క్యారెట్ హల్వా మీ సొంతం.
క్యారెట్ హల్వా కి కావలసిన పదార్ధాలు:
క్యారెట్- 1/2 కేజీ
నెయ్యీ- 1/2 కప్పు
పంచదార-1/4 కేజీ
కాగిన పాలు- 2 కప్పు
జీడిపప్పు- 50 గ్రాములు
ఎండు ద్రాక్ష-50 గ్రాములు
యాలకుల పొడి-1/2 స్పూన్
క్యారెట్ హల్వా తయారు చేసే విధానం:
ముందుగ క్యారెట్ ని బాగా కడగి సన్నగా తురుముకోవాలి.తరువాత కడాయిలో నెయ్యీ పోసి కాగిన తరువాత జీడిపప్పు,
ఎండుద్రాక్ష వేసి దోరగా వేగనివ్వాలి. తరువాత వేగిన జీడిపప్పు,ఎండు ద్రాక్షని తీసి ప్లేటులో పెట్టుకోవాలి.
తరువాత అదే నెయ్యీలో తురిమిన క్యారెట్ వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు అందులోనే పంచదార వేసి 2నిమిషాలు
మగ్గించాలి. దానిలోనే పాలు పోసి బాగా కలిపాలి.ఇదంతా సన్నని మంట మీదనే చెయ్యాలి. ఇది బాగా
దగ్గరకి అయ్యే అంతవరకూ కలుపుతూనే ఉండాలి. నెయ్యీ పైకివచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ముందుగ వేయించి పెట్టుకున్న జీడిపప్పు,ఎండుద్రాక్ష,యాలకుల పొడి కలిపి దింపుకోవాలి. అంతే గుమగుమలాడే క్యారెట్ హల్వాని సర్వ్ చేయండి.