ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం క్యారెట్ శాండ్‌విచ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే క్యారెట్ శాండ్‌విచ్ మీ సొంతం.
క్యారెట్ శాండ్‌విచ్ కి కావలసిన పదార్ధాలు:
మొలకెత్తిన పెసలు- 2 కప్పులు
క్యారెట్ ముక్కలు - 1 కప్పు
ఉల్లిపాయ ముక్కలు - 1 ఒక కప్పు
క్యాప్సికమ్ ముక్కలు - ఒక కప్పు
కొత్తిమీర - కొద్దిగ
బ్రెడ్ - ఒక ప్యాకెట్
నునె - సరిపడ
ఉప్పు - సరిపడ
పచ్చిమిర్చి ముక్కలు - 2 స్పూన్స్
నిమ్మకాయ - 1
క్యారెట్ శాండ్‌విచ్ తయారు చేసే విధానం:
ముందుగా పెసర్లని ఒకరోజు నానపెట్టి రాత్రికి మూట కట్టి పెడితే మరుసటి రోజు మొలకలు వస్తాయి. ఇప్పుడు పెసలు వడకట్టి పక్కన ఉంచాలి. తరువాత బాణలిలో నూనె వేసి కాగాక పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిముక్కలను వేసి వేయించాలి. తరువాత అందులో ఉడికించిన పెసలు కలిపి మరో ఐదు నిమిషాలపాటు వేయించి చివర్లో కొత్తిమీర, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలిపి దించి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు బ్రెడ్‌కు చుట్టూ నెయ్యి రాసి మద్యలో ఈ మిశ్రమాన్ని పెట్టి పైన మరొ బ్రెడ్ పెట్టి పెనం పై నూనె వేసి ఈ శాండ్‌విచ్ ని రెండువైపులా బాగా కాల్చి తీసుకోవాలి. దీనిని టమాటో సాస్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. అంతే కాకా ఎన్నో పోషకాలు కలగలసిన ఈ వంటకం ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది.