ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం క్యారెట్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే క్యారెట్ పచ్చడి మీ సొంతం.
క్యారెట్ పచ్చడి కి కావలసిన పదార్ధాలు:
క్యారెట్ తురుము -1 కప్పు
కొబ్బరితురుము -3స్పూన్స్
పచ్చిమిర్చి -4
నిమ్మరసం - 1స్పూన్
ఉప్పు - సరిపడ
కొత్తిమీర -సరిపడ
మిరియాలు -కొంచం
పోపుగింజలు - 1స్పూన్
క్యారెట్ పచ్చడి తయారు చేసే విధానం:
ముందుగ బాణలిలో నూనె వేసి కాగాక పచ్చిమిర్చి వేసి వేయంచి పక్కకు తీసుకోవాలి. తరువాత క్యారెట్ తురుము, కొబ్బరి తురుము,సరిపడ ఉప్పు, మిరియాలు వేసి మిక్సి చేసుకోవాలి.
ఇప్పుడు బాణలిలో నూనె వేసి కాగాక పోపు గింజలు వేసి వేగినాక పచ్చడి కలిపి పక్కకు తీసుకోని. నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే క్యారెట్ పచ్చడి తయార్.